అసైన్డ్ భూముల క్రయవికాయాలకు అవకాశం ఇవ్వాలని రైతులు నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై చర్చా వేదికలో శనివారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అసైన్ భూముల లబ్ధిదారులకు డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేందుకు అవకాశం ఇస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అలాగే క్షేత్రస్థాయిలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు క్రయవిక్రయాలకు పకడ్బందీ రెవెన్యూ వ్యవస్థ ఉండాలని చర్చలో పేర్కొన్నారు.