నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో శనివారం పెన్షనర్ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని రాజేశ్వర్ తెలియజేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు పాల్గొన్నారు.