రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులు పాల్గొన్నారు.