హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఆదివారం ఉదయం 10: 00 గంటలకు డిచ్పల్లి ఎంపీపీ శ్రీ గద్దె భూమన్న ఇంటికి విచ్చేస్తారు. తర్వాత మధ్యాహ్నం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరాం హెడిగేవార్ స్ఫూర్తి కేంద్రం ప్రాజెక్ట్ పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ పాల్గొనాలని శనివారం తెలిపారు.