సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న దంపతుల కుటుంబాన్ని ఆదివారం మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ముగ్గురు పిల్లలు చదువుకున్నంత వరకు తన పిల్లల మాదిరి చదివిస్తానని హామీ ఇచ్చారు. పిల్లల ఒక్కొక్కరి పేరు మీద రూ.2 లక్షలు చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని, వారికీ పూర్తిగా అండగా ఉంటానని తెలిపారు. సిగ్గు, లజ్జ ఉంటే నేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు రద్దు చేయడం వల్లే ఇక్కడ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.