ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల శివారులో ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించగా నలుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్టు పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు. ఈ దాడిలో పేకాట రాయుళ్ల వద్ద నుండి 23,610 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్స్, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.