నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం డీఎస్సీ ద్వారా మరో 17 మందికి పోస్టింగులు ఇస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉత్తర్వులు అందజేశారు. గతంలో ధ్రువ పత్రాలు సక్రమంగా లేవని కొందరికి అధికారులు పోస్టింగ్లు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి ధ్రువపత్రాలను పరిశీలించి వారికి ఉత్తర్వులు అందజేశారు.