ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కెమెరాలు దర్శనమిచ్చాయి. శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద డ్రోన్ కెమెరాలు ఆకాశంలో ఎగురుతుండగా భక్తులు గమనించడంతో డ్రోన్ ఆపరేటర్లు హుటాహుటీన డ్రోన్ కెమెరాను కిందికి దించారు. సమాచారం అందుకున్న దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పుష్కరిణి వద్దకు చేరుకుని డ్రోన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.