నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో గురువారం స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ సాల్వన్ సంగ మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ సదాశివుడు పాల్గొన్నారు.