గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు అక్టోబర్ 26వ తేదీ వరకు పొడిగించినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూపర్వైజర్ స్ట్రక్చర్, ఎలక్ట్రీషియన్ కోర్సులో శిక్షణ కొరకు నిరుద్యోగ అభ్యర్థులు కొత్త కలెక్టరేట్ దగ్గర, ఐటీ టవర్స్ పక్కన వున్న శిక్షణ కేంద్రంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, 7981360101, 9704587655, 9296507557 వివరాలకు సంప్రదించాలన్నారు.