నిజామాబాద్ జిల్లా అశోక్ సాగర్ లో మంగళవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేప పిల్లల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు.