నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఎస్డిపి యంత్రాన్ని ఆసుపత్రి సూపరిండెంట్ ప్రతిమ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్డిపి యంత్రం ద్వారా రోగి అవసరాన్ని బట్టి ఒకే దాత నుండి ప్లేట్లెట్లను సేకరించడం సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇమ్రాన్ అలీ పాథాలజీ, విభాగాధిపతి చందు, బ్లడ్ బ్యాంక్ ఇన్ ఛార్జ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.