ఖలీల్ వాడి నగరం నిజాం కాలనీకి చెందిన ముజీజ్ బేగ్ భార్య(26) 3 సంవత్సరాల క్రితం మరణించింది. అతనికి పిల్లలు, బంధువులు, తోడబుట్టిన వారు ఎవరు లేకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిస అయ్యాడు. ఒంటరి జీవితం జీవించలేక, జీవితంపై విరక్తితో రైలు కింద పడి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.