టీపీసీసీ అధ్యక్షులుగా బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తరువాత మొదటి సారి నిజామాబాద్ జిల్లా వెళ్తూ.. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ టోల్ గేట్ వద్ద దిగారు. అక్కడ జిల్లా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, మాజీ శాసన సభ్యులు సయ్యద్ యూసూఫ్ అలీ, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ వున్నారు.