చందూర్ మండల కేంద్రంలో మంగళవారం సికింద్రాబాద్ లో దేవాలయం కూల్చివేతపై హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం కూల్చివేత జరిగిన పరిణామంలో వ్యక్తికి మతిస్థిమితం లేదని చెప్పడం తప్పుదోవకు దారితీస్తున్నదని, మతి స్థిమితం లేని వ్యక్తిని ప్రజా క్షేత్రంలోకి ఎలా పంపుతారని, కావాలనే ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలపై కుట్ర పూరిత చర్యలు చేపడుతున్న వారికి ఇదే మా హెచ్చరిక అని అన్నారు.