కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం కిస్టాపూర్ గ్రామంలో రఫీ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రఫీ సుమారు రాత్రి ఒకటి గంటలకి గుండెపోటు రాగా అతనిని ఆటోలో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అంబులెన్స్ లో నిజాంబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు.