బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బన్సువాడ పట్టణం సుందరంగా తయారు చేసిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందని, రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేసారని అభివర్ణించారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఆదర్శవాంతులని కొనియాడారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖకు మంత్రిగా మంచి సేవలు అందించారని, ఆత్మ నిండా పని చెయాలి రాష్ట్రంలో రైతులు బాగుండాలంనే లక్ష్యంతో రైతు సంక్షేమానికి ప్రత్యేక నిధులు మంజూరు చెశారు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభ చైర్మన్ గా ఎమ్మెల్యేలకు పలు సూచనలు ఇస్తున్నారని అన్నారు. ఈ సభ కార్యక్రమంలో భారీ ఎత్తున నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.