నామినేషన్ల సెంటర్ల వద్ద భారీ బందోబస్తు

800பார்த்தது
నామినేషన్ల సెంటర్ల వద్ద భారీ బందోబస్తు
మున్సిపాలిటీ నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో నామినేషన్ సెంటర్ ను బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసే వారు సమయం ముగిసేలోపే దాఖలు చేసుకోవాలని తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సీఐకు సూచించారు. ఈ బందోబస్తు లో బాన్సువాడ. సీఐ మహేష్ గౌడ్, రూరల్ సీఐ టాటా బాబు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி