కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా ఆదివారం 71 ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా గాంధీచౌక్ తదితర వీధులలో ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు దేశభక్తి నాయకుల వేషధారణలతో విద్యార్థులు, పట్టణ ప్రజలలకు చూపరులకు ఆకట్టుకున్నారు. విద్యార్థుల భక్తిగీతాల నృత్యాలు అలరించాయి.. బాన్సువాడ తహసీల్దార్, మండల ప్రజాపరిషత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో, రాజకీయనాయకులు జాతీయ పతాకం ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.