గ్రామ సర్పంచ్ లతో బాన్సువాడ సీఐ సమావేశం

2173பார்த்தது
గ్రామ సర్పంచ్ లతో  బాన్సువాడ సీఐ సమావేశం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామ సర్పంచ్ లతో బాన్సువాడ సీఐ మహేష్ గౌడ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామానికి వస్తే వారి యొక్క వ్యక్తిగత వివరాలు, రవాణా సమాచారం సేకరించాలి అన్ని గ్రామాల సర్పంచులకు చెప్పడం జరిగింది. "విదేశాల" నుండి వచ్చిన వ్యక్తులు, విద్యార్థులు, వలస వచ్చిన కార్మికులు, వారి యొక్క పూర్తి వివరాలు ఆరోగ్య పరిస్థితులను, పూర్తి వివరాలను, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, ఆశా వర్కర్స్ గాని, ఐకేపీ సభ్యులు, గానీ వారి యొక్క వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియజేయాలన్నారు. ఎవరైనా గ్రామాలలో " కరోనా వైరస్" లక్షణాలు కనిపిస్తే పై ఆఫీసర్లు తెలియజేయాలని, అటువంటి వ్యక్తులను క్వారైంటైన్ కు పంపడం జరుగుతుందని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி