చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి మహిళా తనను తాను రక్షించుకొనే విధంగా తయారుకావాలని, అన్ని చట్టాలపై అవగాహణ కోసం శారీరక, మానసిక శిక్షణ పొంది ఉండాలని ఎంన్సీఎల్పీ పిడి ప్రవీణ్ కుమార్ అన్నారు. సురక్షిత కామారెడ్డి ఏర్పాటులో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ పట్టణం రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ లోని అన్ని పాఠశాలల పీఈటీ లకు, ఆక్టివిటి టీచర్లకు స్వీయ రక్షణ ట్రైన్నింగ్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న టెక్నిక్ లు ఆయా పాఠశాలలోని విద్యార్థులకు నేర్పించి సురక్షిత కామరెడ్డి ని ఏర్పాటుకు అందరు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్స్ వాడా సీఐ మహేష్ గౌడ్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అనిల్, చైల్డ్ లైన్ అధికారి ఆనంద్, ఆయా పాఠశాలల పిఈటీ లు, ఆక్టివిటి టీచర్లు పాల్గొన్నారు.