ఆదిలాబాద్ లో నివాసముండే ఎంపిడివో విధులకు వెళ్లేందుకు సోమవారం బస్సులో వచ్చాడు. ముప్కాల్ లో బస్సు దిగి ఆఫీస్ వైపు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.