బాల్కొండలోని పోచంపాడ్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి విద్యార్థులతో కలిసి బస చేశారు శనివారం సాయంత్రం విద్యార్థుల స్టడీ అవర్ సమయంలో పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి నైపుణ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మెనూ, ప్రభుత్వం నుండి అందిన పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ ఉన్నారు.