నిజామాబాద్ జిల్లా జకోరా గ్రామంలో ఆషాడ మాసం చివరి ఆదివారం పెద్ద పోచమ్మ అమ్మ వారికి గ్రామ ప్రజలు పెద్దఎత్తున బోనాలు తీసి అమ్మవారికి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోర్వ గోదావరి గణేష్, ఉప సర్పంచ్ రాజుల దత్తు, వర్ని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.గిరి, బోడ్డోళ్ల సాయిలు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.