టిఆర్ఎస్ పదేళ్ల స్వార్థ పాలన: ఎమ్మెల్యే
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లు వారి స్వార్థం కోసం పని చేశారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త ఇంటి ముత్యం రెడ్డి, కార్యవర్గసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం ఆర్మూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.