నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ ఎంపిటిసి బల్గం రవి మంగళవారం భారాస ను వీడి
కాంగ్రెస్ జిల్లా నాయకులు పెంట ఇంద్రుడు ఆధ్వర్యంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో
కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3వ తారీఖున
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింరాజ్ పల్లి ఎంపిటిసి సిరిగిరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.