ముథోల్: కుబీర్ మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మాలలకు కేటాయించాలి
కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ మాలలకు కేటాయించాలని మండల మాలల ఐక్య వేదిక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మాలులు గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని, మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలకు గానూ 33 గ్రామాలలో ఎస్సీ మాల సామాజిక వర్గం అత్యధికంగా ఉందన్నారు.