కుబీర్ లోని నగేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మార్కెట్ అధికారులు బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 నుండి 10 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాల్ రూ. 7521 మద్దతు ధర ఉంటుందని, ప్రభుత్వం ద్వారా కొనుగోళ్ళు జరిపే (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.