తానూర్ మండలంలోని భోసి, బోల్సా, ఉమ్రి, భైంసా మండలం లోని సిరాల గ్రామానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ను కలిశారు. సిరాల ప్రాజెక్ట్ తెగిపోవడంతో సంవత్సర కాలంగా తమకు ఉపాధి లేదన్నారు. ప్రభుత్వం ద్వారా తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తనవంతుగా పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు.