కుబీర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నామత్కర్ దిగంబర్ కోరారు. సోమవారం కుబీర్ మండల కేంద్రంలో అన్నాబావు సాటే కమిటీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా ఎస్సీలకు కేటాయించిన మార్కెట్ చైర్మన్ పదవిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం తక్షణమే మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.