భైంసా పట్టణంలోని ఆయ్యప్ప ఆలయ ఏడో వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయినాథ్ ఆధ్వర్యంలో ఉదయం నుండి గణపతి పూజ, యాగశాల ప్రవేశం, చండీ హోమం నిర్వహించారు. సాయంత్రం 6. 30 గంటల నుంచి అభిషేక ములు, రుద్రహోమం వేద పారాయణం ఉంటుందని మూడు రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.