ముథోల్ మండలంలోని పలు గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మండల నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 'ఏ' గ్రేడ్ క్వింటా ధాన్యానికి రూ. 2, 320, సాధారణ రకం ధాన్యానికి రూ. 2, 300 ధర ఉందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.