భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు లో బుధవారం మత్స్యశాఖ అధికారులతో కలిసి ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చెరువులు, ప్రాజెక్టులలో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు, మత్స్య సహకార సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు