

భైంసా: ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
భైంసాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని దేవాలయాలలో ప్రత్యేకంగా శనివారాలే దొంగతనానికి పాల్పడుతున్నాడు. మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలా వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ శిందే (36) అనే వ్యక్తి గత కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు. దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 3 కిలోల 150 గ్రాముల వెండి సొత్తు, 3మాసాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.