లోకేశ్వరం: లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

67பார்த்தது
లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4200 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ బుధవారం తెలిపారు. గ్రామంలో పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా అయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 58కోట్లు మంజూరు కాగా, అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వంతో కొట్లాడి అదనంగా రూ. 19 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. మొత్తం రూ. 77 కోట్ల నిధులతో పనులు చేపడతామన్నారు.

தொடர்புடைய செய்தி