కుంటాల మండలం కల్లూర్ శివారులో జాతీయ పక్షి నెమలిని గురువారం రాత్రి కుక్కలు వెంబడించాయి. రైతు సురుకుంట వినోద్ రెడ్డి గమనించి కాపాడాడు. గాయపడిన నెమలి గురించి వీడీసీ అధ్యక్షుడు వెంకట్ కు వివరించాడు. స్పందించిన ఆయన అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్ఎస్ఓ అలేఖ్య, ఎఫ్బఓ సాయిరెడ్డి నెమలికి ప్రాథమిక చికిత్స అనంతరం అటవీ ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు. రైతును అధికారులు అభినందించారు.