తానూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం అశోక విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1956 అక్టోబర్ 14న అశోక విజయదశమి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఐదు లక్షల అనుచరులతో కలిసి నాగపూర్ లోని దీక్ష భూమిలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని, దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం విజయదశమి రోజున బౌద్ధ ఉపాసకులు అశోక విజయదశమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.