పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలకు ఓటు వేయాలని సోమవారం ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు.
బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు. నిరుద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలు ఉంటే ప్రభుత్వం మెడలు వంచవచ్చాన్నారు.