హిందు దేవతల విగ్రహాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందువాహిని, విడిసి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముధోల్ లో శనివారం బంద్ చేపట్టారు. మండల కేంద్రంలో అన్నీ వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందు దేవతల విగ్రహాలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.