గ్రామస్తులు కలిసిమెలిసి ఉండాలని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. మంగళవారం ముధోల్ మండలంలోని బోరేగాం గ్రామాన్ని ఆర్డిఓ కోమల్ రెడ్డితో కలిసి సందర్శించారు. గ్రామంలో ఇటీవలే నెలకొన్న వివాదంపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉంటూ గొడవలు చేసుకోవద్దన్నారు. సమస్యలు ఉంటే అధికార దృష్టికి తీసుకురావాలని సూచించారు.