మండల కేంద్రమైన ముధోల్ లోని ఎం ఎల్ ఎస్ పాయింట్ ను బుధవారం తహసిల్దార్ శ్రీకాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదాం లోని స్టాక్ ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తూకాన్ని సైతం సరిచూశారు. బియ్యం నాణ్యతను, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. ఆయన వెంట సిబ్బంది, తదితరులు ఉన్నారు.