ముధోల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 5 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మంగళవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. బాసర నుండి ఓని వరకు రోడ్ నిర్మాణానికి 2 కోట్లు, నర్సాపూర్ మండలం అంబకంటి నుండి నందన్ వరకు రహదారి నిర్మాణానికి 2 కోట్లు, భైంసా మండలం వానల్ పాడ్ నుండి పెండ్ పెల్లి గ్రామానికి 1 కోటి రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.