కుబీర్ మండలంలో శుక్రవారం ఎంపీ గోడం నగేష్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పర్యటించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షుడు ఏశాల దత్తాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. కావున మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గురువారం కోరారు.