లోకేశ్వరం మండలం వటొలి గ్రామానికి చెందిన సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ముధోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన 2000-01 బ్యాచ్ కి చెందిన ఉజ్వల భర్తను కోల్పోయిన విషయాన్ని తెలుసుకున్న తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులను పరామర్శించి బుధవారం రూ. 36వేల ఆర్థిక సాయం అందించారు. మిత్రులకు ఆపదలో ఆదుకునేందుకు అందరం ముందుంటామని పేర్కొన్నారు. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలవడం పట్ల పలువురు అభినందించారు.