రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ముథోల్ నియోజకవర్గ సమన్వయ సభ్యుడు కిరణ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ ధాన్యం కొనుగోలులో పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కోసి 45 రోజులైన కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.