రోడ్డుపై వేసిన మొక్కజొన్న పంట సంచులను ఢీకొని యువకునికి తీవ్ర గాయాలైన ఘటన కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. చొండి గ్రామ శివారులో రైతులు మొక్కజొన్న పంట సంచులను అక్రమంగా రోడ్డుపై ఉంచారు. బెల్గం గ్రామానికి చెందిన సాయి చీకట్లో రోడ్డుపై వేసిన మొక్కజొన్న సంచులు కనపడక బైక్ తో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రవీందర్ వివరాలు సేకరిస్తున్నామన్నారు.