దిలావర్పూర్ మండల కేంద్రంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ జేఏసీ నాయకులు ఈనెల 16న తలపెట్టిన ఛలో దిలావర్పూర్ విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు ఆదివారం కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత మూడు నెలల నుండి దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.