భైంసా పురపాలక కార్యాలయాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి ఫైజాన్ హైమాద్ సందర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చ్ 31లోగా ప్రాపర్టీ, నీరు, ట్రెడ్ లైసెన్స్ పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.