ఆరు నెలల్లో భైంసా సిరాల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం 8 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువు పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 నెలల క్రితం సిరాల ప్రాజెక్టు భారీ వర్షాలతో తెగిపోయిందని, ఆ సమయంలో తాను అక్కడే ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవడం జరిగిందన్నారు.