భైంసా డివిజన్ పరిధిలో బుధవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి.
వేకువజాము నుంచే ఆలయాల్లో విశేష పూజలు జరిపించారు. భైంసా చెరువుకట్ట శివాలయం, సుద్ద వాగు శివాలయం, శిలారం శివాలయం, ముధోల్లోని జఠశంకర్ ఆలయం, కుబీర్ మండలం పాంగర్పాడ్ శివాలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.